SAKSHITHA NEWS

భారత మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

దేశ ప్రధానిగా, ఆర్ధిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్ గా ఎన్నో కీలక పదవుల్లో విశిష్టమైన సేవలు అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి, మౌనం పాటించి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో కొత్త సంస్కరణలతో మన ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలను చేర్చారని గుర్తు చేశారు. భారతదేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని వారి మరణం పట్ల సంతాపం తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, మల్లేష్, యాదగిరి, అగ్రవాసు, నాగేష్ గౌడ్, పోశెట్టిగౌడ్, నరసింహులు, రవీందర్, మహేష్, సంతోష్ బిరాదర్, ఉమేష్, బషీర్, ఖలీమ్, జనార్దన్, నాగభూషణం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS