విద్యార్థుల కోసం ప్లేట్ల పంపిణీ చేసిన మాజీ ఎంపీటీసీ బండారి శ్రీవాణి-కిరణ్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో సహాయం…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పాలకుర్తి, పాలకుర్తి మండలం గన్ శ్యామ్ దాస్ నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి శ్రీవాణి-కిరణ్ దంపతులు ప్లేట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు ప్రతిరోజూ ఇంటి నుంచి ప్లేట్లు తీసుకురావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిపల్లి ప్రభాకర్ రెడ్డి తెలియజేయగా, స్పందించిన వారు తమ సొంత ఖర్చులతో ప్లేట్లను అందజేశారు.
ఈ సందర్భంగా బండారి కిరణ్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్య ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అలాగే పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ కొనసాగుతుందని, విద్యార్థుల అవసరాల కోసం ఎప్పటికప్పుడు అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిపల్లి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు చందుపట్ల మధు కుమార్, రేణుకుంట్ల చంద్రయ్య, బత్తుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
