జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఘన విజయం
*బయట పడ్డ చిన్న శ్రీశైలం యాదవ్ చరిష్మా
*ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడ
*ఇక జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ రూలింగ్ షురూ…

*మరో 10 ఏళ్ళు కొనసాగనున్న హవా…
*కాంగ్రెస్ కు కంచు కోటగా మారనున్న జూబ్లీహిల్స్
అవును సాక్షిత అంచనాలు ఏమాత్రం తప్పలేదు. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు, యువ నాయకుడు, స్థానికుడు అయిన నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని సాక్షిత ఘంటాపథంగా చెప్పింది. అంతిమంగా అదే నిజం అయ్యింది. సాక్షిత ఇప్పుడే కాదు… చాలా సార్లు సీనియర్ జర్నలిస్ట్ ల సారథ్యంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేసి… నిజాల్ని నిగ్గు తేల్చింది… వాస్తవాలను విడమర్చి చెప్పింది.
అదే సాక్షిత కు ఉన్న… బలం… బలగం… సర్వే పేరుతో వందల మంది విద్యార్థులు, సమాజంపై అవగాహన లేని వారితో తూ… తూ… మంత్రంగా కొన్ని అభిప్రాయాలకు వచ్చి… ప్రజలను గందరగోళంకు గురి చెయ్యకుండా… సమాజంపై లోతైనా అవగాహనతో… సీనియర్ జర్నలిస్ట్ ల అనుభవాన్ని కలిపి… వాస్తవానికి దగ్గరగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో కనిపించని కష్టాలెన్నో… అర్థం చేసుకోని వాళ్ళ అవహేళనలు మరెన్నో…
సరే… ఇదంతా పక్కన పెడితే… జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడం… ఆయనకే కాదు మా సాక్షిత మీడియాకు కూడా ఆనందదాయకం. అంటే ఇక్కడ మేము ఏక పక్షముగా ఒక పార్టీకో… లేదా అభ్యర్థికో సపోర్ట్ చేతున్నాం అని మీరు భావిస్తే తప్పులో కాలు వేసినట్టే. కేవలం మా సాక్షిత మీడియా ప్రత్యేకంగా సీనియర్ జర్నలిస్ట్ లతో చేపట్టిన సర్వే అంచనాలు తప్పనందుకు ఈ ఆనందం. అంతే చిత్తగించగలరు.

ఇక విషయానికి వస్తే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నించాయి. అయితే అసలైన పోటీ మాత్రం… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే జరిగిందని చెప్పొచ్చు. ఈ రెండు పార్టీలు నామినేషన్ల అనంతరం గట్టి పోటీని ఇచ్చుకున్నాయి. ఒకానొక సందర్భంలో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పడం రాజకీయ ఉద్దండులకు, విశ్లేషకులకు కూడా కష్టంగా మారింది. అయితే… సాక్షిత మీడియా టీం మాత్రం…తాము నిక్కచ్చిగా చేసిన సర్వే ప్రకారం… మొదటి నుంచి జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ పక్కా అని ఘంటాపథంగా చెప్పింది.
అడుగడుగునా అడ్డంకులు… రౌడీ అనే ముద్ర వేసి ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నాలు… సింపతీ కోసం కపట నాటకాలు… మీడియను, ప్రజలను తప్పు దారి పట్టించేందుకు ప్రతీ రోజు కుయుక్తులు… అన్నింటికీ సమాధానం ఒక్క గెలుపు మాత్రమే.
వారు ఆడిన నాటకాలే అసలు నిజాలు బయట పడేలా చేశాయి. అసలు నిజం ప్రజలకు అర్థం అయ్యేలా చేశాయి. ఎవరు రౌడీ, ఎవరు సేవకుడు అనే విషయాన్ని తేల్చిచెప్పాయి. జూబ్లీహిల్స్ ప్రజలు తమ అసలైన నాయకున్ని వెతుక్కోవడానికి మార్గం వేశాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మరణంతో… గజిబిజి వాతావరణంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. రాజకీయ సంప్రదాయం ప్రకారం ఆ స్థానములో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించగా… కాంగ్రెస్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషించింది. ఆ అన్వేషణ ఫలితమే నవీన్ యాదవ్ ఎంపిక. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించారు. రాజకీయంగా… సామజికంగా… సేవా పరంగా… రేవంత్ కు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబమే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నెలకొన్న పరిస్థితితులకు ప్రత్యామ్నాయంగా కనిపించింది. అంతే సీఎం రేవంత్ చకచకా పావులు కదిపారు. మంత్రులను, ముఖ్య నాయకులను రంగంలోకి దింపారు. కాంగ్రెస్ నాయకుల ప్రచారం దెబ్బకు బీఆర్ఎస్ నాయకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. అంతటితో ఆగకుండా… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగి… జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని నింపిదని చెప్పవచ్చు. గెలుపు వన్ సైడ్ అని డిసైడ్ అయ్యింది అక్కడే. జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా ఆలోచనలో పడింది అక్కడే. ధనికుల కింగ్ పాలెస్ గా పేరున్న తమ జూబ్లీహిల్స్ లో పేద, బడుగు బలహీన వర్గాల వెతలు తీరాలంటే… అద్దాల మేడల పక్కన ఉన్న ఆకుల గుడిసెల్లో ఉండే సామాన్యుడి కష్టాలు కడతేరాలంటే… నవీన్ యాదవ్ ను గెలిపించుకోవాలి అని జూబ్లీహిల్స్ ప్రజలు అభిప్రాయానికి వచ్చారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు తాను అండగా ఉంటానని ఏకంగా సీఎం రేవంత్ చెప్పడం ఓటర్లలో బలమైన ముద్ర వేసింది.
ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ… మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ… అన్నింటికీ మించి చిన్న శ్రీశైలం యాదవ్ గత నాలుగు ఐదు దశాబ్దాలుగా ప్రజలకు చేస్తున్న సేవ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయకేతనం ఎగురవేయడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
పదవులు ఉన్నా… లేకున్నా… చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం పేదలకు అండగా నిలిచింది. అన్నా అని అర్ధ రాత్రి పిలిచినా… నేను ఉన్నా అని అభయ హస్తం ఇచ్చారు. అందుకే హస్తం తోడుగా… ఈ రోజు జూబ్లీహిల్స్ లో గెలుపు పిలుపు వినిపించారు.
చూసింది కొంతే… చూడాల్సింది కొడంత ఉంది అన్నట్లు… ఈ విజయంతో జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం హవా మొదలైంది. ఈ గాలి మరో 10 ఏళ్ళు… అయితే అంతకంటే ఎక్కువే వీచే అవకాశం ఉంది. ఇదీ సాక్షిత మీడియా అంచనా… ఏమో..! ఈ గెలుపు గుర్రం… జూబ్లీహిల్స్ లో మళ్ళీ మళ్ళీ జెండా ఎగర వెయ్యవచ్చు.

