ఖమ్మం నగరం లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న – మాజీ ఎంపీ నామ
పలు కుటుంబాలకు మాజీ ఎంపీ నామ పరామర్శ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం కార్పొరేషన్ 3వ, 5వ డివిజన్లలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల ఖమ్మం కార్పొరేషన్ మూడవ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా బల్లేపల్లి లోని వారి నివాసనికి వెళ్లి జగన్ చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ మంచి రాజకీయ భవిష్యత్ వున్న బీసీ నాయకుడన్నారు. జగన్ మృతి పట్ల నామ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలానే ఖమ్మం కార్పొరేషన్, ఐదవ డివిజన్, ఖానాపురం హవేలీ, బాలాజీ నగర్ కు చెందిన యల్లంపల్లి హనుమంతరావు మాతృమూర్తి యల్లంపల్లి వరమ్మ ఇటీవల మృతి చెందగా వారి నివాసానికి వెళ్లి వరమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాల్లో నల్లమల వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ 7వ డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులు లక్ష్మణ్, నరసింహారావు, కొనకంచి వర ప్రసాద్, కాట్రాల శ్రీరాములు, ఆకుల వెంకటేశ్వర్లు, పల్లెబోయిన చంద్రం, బిఆర్ఎస్ వైరా రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు గొడ్డేటి మాధవరావు, మోరంపూడి ప్రసాద్ రావు, పాటిబండ్ల ప్రసాద్ తో పాటు అంబటి కృష్ణయ్య, కావూరి శ్రీను, దొబ్బల నరసింహారావు, భూక్యా రమేష్, ఆత్కూరు నరేష్, నాగేందర్ సింగ్, రాజుల రామారావు, కాట్రాల దినేష్, అల్లాడి గురవయ్య, వి.రామకృష్ణ, పురం రమేష్, కె రమేష్ నామ సేవ సమితి రాజేష్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.