స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీమంత్రి తలసాని
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. భువనగిరి వద్దగల ఆలయానికి చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ చైర్మన్ మానేపల్లి గోపి MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. తదనంతరం ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపం, డైనింగ్ హాల్, ఆలయ పరిసరాలలోని ఇతర ప్రాంతాలను తిరిగి పరిశీలించారు. ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని చైర్మన్ గోపి వివరించారు. రాబోయే రోజుల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. MLA వెంట యాదాద్రి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు అయోధ్య యాదవ్ తదితరులు ఉన్నారు.