శివ లింగ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్:
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో వైభవంగా శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత మహా మృత్యుంజయేశ్వర(మరకత లింగం) సహిత నందీశ్వర, సుబ్రహ్మణ్య స్వామి శిఖర ప్రతిష్ఠా మహోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా
జరుగుతున్నాయి.ఈ మహోత్సవంలో భాగంగా జరిగిన శివ లింగం ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, 8వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల మధుసూదన్ పాల్గొని, నూతనంగా ప్రతిష్ఠించిన
శివ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మాట్లాడుతూ… ఈ దేవాలయం భక్తులందరికీ ఆశీస్సులు అందించి, నిజాంపేట్ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
