ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ మాజీ అటెండర్ షరీఫ్ తో ప్రత్యేక అనుబంధం – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 44 సంవత్సరాలకు పైగా అటెండర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఎండీ షరీఫ్ ని సన్మాణించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి …తాను ఘట్కేసర్ ఎంపీపీగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఐదేళ్ల కాలంలో నిత్యం తరగని ఉత్సాహంతో పనిచేస్తూ కార్యాలయానికి సమస్యలతో వచ్చే ప్రజానీకానికి మరియు తనకు అధికారులకు మధ్యన వారధిగా ఉండి ఆయన బాధ్యతలు నిర్వహించే వారు అని,తన పట్ల కూడా ప్రత్యేక ఆదరాభిమానాలు చూపించిన షరీఫ్ లాంటి వ్యక్తుల వల్ల ఆయా కార్యాలయాలను వన్నె వస్తాయి అని,ఉద్యోగ విరమణ అనేది వయసుకు తప్పించి పనికి కాదు అని ఆయన తన శేష జీవితాన్ని పూర్తి ఆరోగ్యాలతో గడిపేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు…