ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు

Sakshitha news

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు

రూ.60 లక్షల బీమా వర్తింపు హర్షణీయం………….*జిల్లా అధ్యక్షులు భరత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ సాగర్

సాక్షిత వనపర్తి :
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడంపై వనపర్తి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భరత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు.జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలో కార్పొరేషన్లు సొసైటీలు స్థానిక సంస్థలలో వేలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని. వారికి కూడా రూ.60 లక్షల వరకు బీమా రక్షణ కల్పించడం ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప భరోసా కలిగిస్తుందని అధ్యక్ష కార్యదర్శిలు పేర్కొన్నారు.

గతంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించినప్పటికీ అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరంగా ఉండే పరిస్థితి నెలకొనేదినీ. ప్రస్తుతం ప్రభుత్వం వారికి కూడా ఈ బీమా పథకం పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఏజెన్సీ వ్యవస్థను తీసివేసి కార్పొరేషన్ లేదా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని జేఏసీ నాయకులు తెలియజేశారు…

Scroll to Top