రాష్ట్ర ప్రభుత్వ పాలన
వైఫల్యాలపై ర్యాలీ, ధర్నా చేపట్టిన ………….బిజెపి
యూరియా కొరతను సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే
*సాక్షిత వనపర్తి:
కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వైఫల్యాలపై బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించ ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలను ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన 420 హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు 4000 దివ్యాంగుల పెన్షన్ 6000, వితంతువులకు పెన్షన్లను యువతకునిరుద్యోగ భృతి 4016, విద్యార్థినిలకు స్కూటీలు షాదీ ముబారక్ తులం బంగారం ఇతర పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అలాగే రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయలేదని అలాగే బిజెపి మోదీ ప్రభుత్వం ముందుగానే యూరియాను రాష్ట్రానికి అందజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేసిన యూరియాను పక్క రాష్ట్రానికి , బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు అమ్ముకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తూ రైతులను వేధిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తి మున్సిపాలిటీ లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని పట్టణ కేంద్రంలో రోడ్ల విస్తరణ లో భాగంగా ఇల్లు కోల్పోయిన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు ప్రభుత్వం సహాయం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందలేదని మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డులలో తాగునీరు ఏ క్షణం ఏ రోజు ఏ సమయానికి వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తాగునీటి సరఫరా వై అధికారులు సమయ సూచిక పాటించాలని సూచిస్తూ మున్సిపాలిటీల లోనే కాకుండా గ్రామాలలో కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలోనూ క్షేత్రస్థాయిలోనూ ఘోర పరాభవం తప్పదని జోష్యం పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి వెంకట్ రెడ్డి ఓబిసి మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం ఆర్ వెంకటేశ్వర్ రెడ్డి సీతారాములు శ్రీమతి సుమిత్రమ్మ పి విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు శ్రీనివాస్ గౌడ్ వారణాసి కల్పన జిల్లా ఉపాధ్యక్షులు బాబురావు మురారి నాయక్ జిల్లా కార్యదర్శి కాటమొని కృష్ణ గౌడ్ సరోజ జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి ఆగు పోగు కుమార్ జిల్లా మీడియా ఇంచార్జ్ గజరాజుల తిరుమలేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
