SAKSHITHA NEWS

MCRHRD ఇన్స్టిట్యూట్ లో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు లేజిస్లేచర్ ఒరియెంటెషన్ ప్రోగ్రాంను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు .

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు , పొన్నం ప్రభాకర్ , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా” నరసింహా చార్యులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “

ప్రజా ప్రతినిధి పదవి అనేది మహోన్నత పదవి. అందరికీ ఈ పదవి దక్కదు. అదృష్టం ఉన్న వారికి మాత్రమే దక్కుతుంది. గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒరియెంటెషన్ కార్యక్రమాలను నిర్వహించలేదు. నేటి ప్రభుత్వ హయాంలో నిర్వహించుకుంటున్నాం . ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలిచిన తరువాత ప్రమాణస్వీకారం రోజునే ఐడి కార్డ్ తో పాటు రూల్స్ అండ్ రెగులేషన్స్ పుస్తకాలు ఇస్తాం కానీ వాటిని ఎవరు కూడా చదవడం లేదు. లేజిస్లేచర్ కి సంబంధించిన పుస్తకాలు తప్పకుండా చదవాలి . ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల్లో 57 మంది నూతనంగా ఎన్నికైన వారే ఉన్నారు. వారందరూ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకోవాలి . ఎంబీబీఎస్ చదివితే డాక్టరు అవుతారు ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్ అవుతారు అలాగే ప్రజల మనస్సు చదివితేనే ప్రజా ప్రతినిధులం అవుతాము. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలతో మమేకం అయ్యి ఉంటేనే భవిష్యత్ లో గెలుస్తారు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కూడా విపరీతంగా పెరిగింది ఇది సమాజానికి మంచిది కాదు. అతి సామాన్యుడు కూడా పోటీ చేసే విధంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజం కానీ ఆ విమర్శలకు భయపడకుండా ప్రతివిమర్శతో ముందుకు వెళ్ళాలి . చట్ట సభలను ఎన్ని రోజులు అయినా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము .

ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ….

ప్రజాస్వామ్యంలో చట్టసభలది క్రియాశీల పాత్ర, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత శాసన సభ్యులపై ఉంటుంది. చట్టాల రూపకల్పనతో పాటుగా అనంతరం వాటి అమలు తీరు, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. శాసన సభ్యులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తుంటారు, చర్చించుకుంటారు. సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండడంతో సభ్యులు ఏమి మాట్లాడుతున్నారో ప్రజలకు సులభంగా తెలిసిపోతుంది. గతంలో శాసనసభ సమావేశాల సమయంలో సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న చరిత్ర ఉన్నది. శాసనసభ వ్యవహారాలపై సభ్యులకు పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే సభ్యులు సభలో అర్ధవంతంగా మాట్లాడుతారు. నూతన సభ్యులతో పాటుగా సభ్యులందరికి ఈ ఓరియంటేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో సీనియర్ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు నూతన సభ్యులకు ఇన్సిపిరేషన్ గా
ఉండేది. రోశయ్య , రజీబ్ అలీ, బోడేపూడి వెంకటేశ్వరరావు, చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఓంకార్, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నర్రా రాఘవ రెడ్డి వంటి వారు గొప్ప వక్తలుగా పేరు తెచ్చుకున్నారు. సభలో మాట్లాడడానికి సమాచారం, వాగ్ధాటితో పాటుగా సభా వ్యవహారాలు, నిబందనలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా జీరో అవర్, కొశ్చన్ అవర్, రిజల్యూషన్స్, అడ్జర్న్ మెంట్ మెన్షన్స్, పాసింగ్ ఆఫ్ బిల్స్, పాసింగ్ ఆఫ్ బడ్జెట్, సభ్యుల గౌరవ మరియు మర్యాదలు, ప్రోటోకాల్, వ్యవహారాలు వంటి ముఖ్యమైన కార్యకలాపాలపై సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఢిల్లీకి చెందిన PRS ఇన్సిట్యూట్ కు దేశంలోని లేజిస్లేచర్ వ్యవస్థలు, వ్యవహారాలపై పూర్తి స్థాయి పట్టు ఉన్నది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ఉన్నారు. ఈ సంస్థ వారు దేశంలోని వివిధ రాష్ట్రాలలోని శాసనసభ్యులకు ఓరియెంటెడ్ ప్రోగ్రాంలు నిర్వహించారు. ఈ రెండు రోజుల అవగాహన సదస్సు మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సభ్యులందరు తప్పనిసరిగా పాల్గొని సభ వ్యవహారాలపై అవగాహన తెచ్చుకోవాలని నా మనవి. గతంలో మాదిరిగా మొక్కుబడిగా ఒకటి రెండు రోజులు కాకుండా ప్రభుత్వం కోరిన విధంగా ఎక్కువ రోజులు సభా సమావేశాలు నిర్వహిస్తాం. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లాగా ఉత్తమ లేజిస్లేటర్ అవార్డు ఇచ్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం. ఏర్పాట్లు చేసిన లేజిస్లేచర్ సేక్రెటరి నరసింహా చార్యులు గారికి అభినందనలు.

శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “

గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. లేజిస్లేచర్ మీటింగ్ కి పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. బి ఆర్ యస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాకపోవడం శోచనీయం. ఈ కార్యక్రమాలకు రావాలని బి ఆర్ యస్ పార్టీ ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేస్తున్నాం . ఉత్తమ ఎమ్మెల్యే, ఉత్తమ ఎమ్మెల్సీ అవార్డులు ఇంకా నుండి ప్రతి సంవత్సరం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “

అసెంబ్లీ సమావేశాలు ఎన్ని ఎక్కువ రోజులు నడిపితే అంత మంచిది . 2014 నుండి కేవలం 4 నుండి 5 రోజులు మాత్రమే సమావేశాలు నడుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం కచ్చితంగా వీలైనన్ని ఎక్కువ రోజులు నడిపించాలని కోరుతున్నాం .

ఈ కార్యక్రమంలో 65 మంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , హాజరయ్యారు.


SAKSHITHA NEWS