SAKSHITHA NEWS

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే అధికారులు.. భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో 28 రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం; కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్‌ నుంచి కొల్లం, నర్సాపుర్‌ నుంచి కొల్లంకు ఈ రైళ్లు నడపనున్నారు.
డిసెంబర్‌ 11 నుంచి జనవరి 29వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్లకు అడ్వాన్సు బుకింగ్స్‌ శుక్రవారం (డిసెంబర్‌ 6 ) ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. రైళ్ల నంబర్లు, సర్వీసులందించే తేదీలు, టైమింగ్స్‌ తదితర వివరాలు ఇవిగో.. 


SAKSHITHA NEWS