పేట ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం..
చిలకలూరిపేట పట్టణంలో గత ఆదివారం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా
ఆర్టీసీ ఉద్యోగులు మరియు వృద్ధుల కోసం కంటి వైద్య శిబిరంనిర్వహించారు.ఈ శిబిరంలో శంకర వైద్యశాల వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు.పరీక్షల్లో కంటి ఆపరేషన్ అవసరమని తేలిన వారిని శంకర వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి, సురక్షితంగా ఆస్పత్రికితరలించారు. శస్త్రచికిత్స పూర్తయినఅనంతరం రోగులను క్షేమంగా తిరిగి చిలకలూరిపేటకు తరలించి,ఆర్టీసీ
బస్టాండ్ వద్ద వారి గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేర్చేలా శ్రద్ధ చూపారు.ఈ శిబిరం సఫలీకృతం కావడానికి క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు మరియు వృద్ధులు ఈ సేవలపైసంతోషం వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
