- ఖరీదైన బైకులు లక్ష్యంగా దొంగతనాలు
- 27 బైక్ దొంగతనం కేసులు ఛేదించిన సూర్యాపేట జిల్లా పోలీసు.
ఖరీదైన బైకులను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న కోదాడ పట్టణ, మునగాల పోలీసులు. - కోదాడ పట్టణ కేసు కు సంబంధించి ఐదుగురు దొంగలను అరెస్టు చేసి వారి నుండి 21 కేసులలో 22 లక్షల విలువగల 21 బైకులు సీజ్ చేయడం జరిగింది.
- మునగాల కేసుకు సంబంధించి ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి నుండి 6 కేసుల్లో 3.1 లక్షల విలువగల 6 బైకులు సీజ్ చేయడం జరిగినది.
- మొత్తం 28 కేసుల్లో 25 లక్షల విలువగల 27 బైకులు సీజ్.
- 8 మంది దొంగల అరెస్టు.
- రాయల్ ఎన్ఫీల్డ్స్ బైకులు – 6, యునికార్న్ బైక్ లు – 7, పల్సర్ బైకులు – 10, HF డీలక్స్ – 2, గ్లామర్ బైక్ – 1, శైన్ బైక్- 1.
కోదాడ పట్టణ, మునగాల కేసులకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు. కార్యక్రమం నందు పాల్గొన్న కోదాడ DSP శ్రీధర్ రెడ్డి, CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ పట్టణ CI రాము, మునగాల సర్కిల్ CI రామకృష్ణా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, SI లు శ్రీకాంత్, ప్రవీణ్, రంజిత్ రెడ్డి, CCS సిబ్బంది ఉన్నారు.
కోదాడ పట్టణ కేసు వివరాలు
కోదాడ పట్టణంలో ఖరీధైన బైక్ లను గుర్తు తెలియని వ్యక్తులు వరసగా దొంగతనం చేస్తున్నారు. భాదితుల పిర్యాధు పై కోదాడ పట్టణ PS నంధు నేరం సంఖ్య 353/2024, 451/2023, 360/2024, 359/2024 ప్రకారం బైక్ దొంగతనం కేసులు నమోదైనాయి. ఈ కేసులు దర్యాప్తు లో ఉన్నాయి.
తేది 03/11/2024 అధివారం రోజు సాయంత్రం 4.00 గంటల సమయంలో కోదాడ పట్టణంలో హుజూర్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర కోదాడ పట్టణ సిఐ రాము అతని సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాలపై వస్తున్న ఐదుగురిని అనుమానాస్పదంగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగినది. వారు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కు చెందిన A1- బారి నాగరాజు @ గుంటూరు నాగరాజు (28 సం.లు డ్రైవింగ్), ఆంధ్రా రాష్ట్రం పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన A2 - గుంజి రామాంజనేయులు (23 సం.లు డ్రైవింగ్), A3 షేక్ కాసినపల్లి బాష (24 సం.లు వ్యవసాయం) , A4 - గుంజి కృష్ణ (వ్యవసాయం), A5- తమ్మిశెట్టి వెంకటేష్ (21 సం.లు వ్యవసాయం) A6 గోపాలకృష్ణ (పరారి) లుగా గుర్తించడం జరిగినది. అదుపులోకి తీసుకున్న 5 గురు నిందితులను విచారించగా ఖరీదైన బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. గతంలో కోదాడ పట్టణంలో రాయల్ ఎన్ఫీల్డ్, ఒక యూనికాన్ ఒక పల్సర్ బైక్ ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిని విచారించగా సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, హుజూర్నగర్, మఠంపల్లి, కాచిగూడ, చైతన్యపురి, ఎల్బీనగర్, దామేరచర్ల, నరసరావుపేట, రెంటచింతల, మాచర్ల, రాజుపాలెం, నకిరేకల్లు(అద్దంకి) పోలీస్ స్టేషన్ల పరిధిలో బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొనగా వీరిని అరెస్టు చేయడం జరిగినది.
A-1 నాగరాజు సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల పరిధి మట్టపల్లి గ్రామంలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ చాకచక్యంగా బైక్లను దొంగతనం చేసేవాడు. మట్టపల్లి ప్రక్కనే ఉన్నఆంద్రా ప్రాంత తంగెడ గ్రామానికి ఇతనివద్దకు A2, A3, A4 లు బైక్ రిపేర్ చేయించుకునే వారు. నాగరాజు దొంగిలించిన రాయల్ ఎన్ఫెల్డ్ బైకులను A2, A3, లకు అమ్మినాడు. వీరి మధ్య పరిచయం ఏర్పడి A2, A3, A4 లు బైక్ వైర్ కట్ చేసి బైక్ దొంగిలించడం నేర్చుకున్నారు. అప్పటి నుండి A1, A2, A3, A4 మరియు A5 లు 5 గురు నిందితులు కలిసి బైక్ దొంగతనాలు చేస్తున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకుని కోదాడ టౌన్ లో రాయల్ ఎన్ఫీల్డ్స్ బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగినది. నాగరాజు పై గతంలో హైదరాబాద్ పరిధిలో 05 కేసులు ఉన్నాయి.
నింధితుల నుండి 22 లక్షల విలువగల 21 బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ 6, యూనికాన్ 7 పల్సర్ 5, హెచ్ఎఫ్ డీలక్స్ 2, షైన్ 1 బైక్ లను సీజ్ చేయడం జరిగినది. 5 గురు నింధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది.
ఈ కేసులో భాగా పని చేసిన CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్,CCS SI శ్రీకాంత్ మరియు CCS సిబ్బందిని, కోదాడ పట్టణ CI రాము, కోదాడ టౌన్ PS సిబ్బంది టెక్నికల్ టీం సిబ్బందిని, కేసు పర్యవేక్షణ చేసిన DSP శ్రీధర్ రెడ్డిని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు రివార్డ్స్ అందించి అభినంధించారు.
మునగాల PS కేసు వివరాలు
ఈ సవత్సరం జూలై నెలలో మునగాల మండల పరిధి ముకుందాపురం గ్రామంలో పల్సర్ బైక్ దొంగతనం చేసినారు అని క్రేన్ డ్రైవర్ కుంచం రాజు మునగాల పోలీస్ స్టేషన్ నందు పిర్యాధు చేసినారు ఈ పిర్యాధు మేరకు నేరం సంఖ్య 239/24 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగినది. ఈ కేసు దర్యాప్తు లో ఉన్నది.
విచారణ జరుగుతుండగా 03.11.2024 మద్యహన్నం 3.00 గంటలకు మునగాల SI ప్రవీణ్ తన సిబ్బందితో కలిసి ముకుందాపురం గ్రామ బస్ స్టేజీ వద్ద వాహన తనిఖీ నిర్వహించి, 16:00 గంటలకు ఒక మోటారు సైకిల్‌లో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కోదాడ నుండి సూర్యాపేట వైపు వెళ్తున్నారు. వారిని ఆధుపులోకి తీసుకుని విచారించడం జరిగినది. ఆంద్రా రాష్ట్రం NTR జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన వారీగా గుర్తించడం జరిగినది. A-1 మెచ్చర్ల శ్రీను (22 సం.లు, క్యాతరింగ్ వృత్తి) ,A-2 అలుగుల తరుణ్ (20 సం.లు లారి క్లీనర్), A-3 కొంక చిన్ను @ కోడి (19 సం.లు దుకాణం) ముగ్గురు ముకుందపురం గ్రామంలో పల్సర్ బైక్ దొంగతనం చేయినట్లు ఒప్పుకున్నారు. అల్లాగే కోదాడ పట్టణంలో 3 బైక్స్ దొంగతనం, పెనుములూరు PS పరిధిలో 1 బైక్, విజయవాడ 5వ టౌన్ లో 1 బైక్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. వీరి నుండి 5 పల్సర్ బైక్ లు, ఒక హోండా Passion బైక్ స్వాదినం చేసుకుని రిమాండ్ కు తరలించడం జరిగినది.
A1 మెచ్చర్ల శ్రీను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నంధు పనిచేసేవాడు మరియు క్యాటరింగ్ పని చేసేవాడు సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోక డబ్బులు ఎలాగైనా సంపాదించాలని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నంధు పరిచయమైన స్నేహితుడు A2 తరుణ్, మరో A3 స్నేహితుడు చిన్ను లతో కలిసి ముకుందాపురం, కోదాడ ప్రాంతంలో బైక్స్ దొంగతనాలు చేశారు. నింధితులు వారి జల్సాల కోసం డబ్బు సంపాదించడం లక్షంగా రోడ్లపై, ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్స్ ను టార్గెట్ చేసి దొంగతనం చేసేవారు. దొంగతనం చేయగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
నిందితుడు A2 పై గతంలో ఖమ్మం జిల్లా మధిర, NTR జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్స నందు 2 బైక్ దొంగతనం కేసులు నమోదైనాయి.
ఈ కేసు చెదనలో బాగా పని చేసిన మునగాల SI ప్రవీణ్ కుమార్, మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బందిని, కోదాడ టౌన్ పిఎస్ టెక్నికల్ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను, కానిస్టేబుల యల్లారెడ్డి, సతీష్ లను, కేసు పర్యవేక్షణ చేసిన మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, కోదాడ DSP శ్రీధర్ రెడ్డి లను ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి అభినందించారు.