భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

Sakshitha news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో నెల రోజుల పాటు చైతన్యం పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నాం : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్


సాక్షిత :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల, నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు. చైతన్యం పేరుతో ఈ రోజు అక్టోబర్ 15 నుండి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలన కోసం వివిధ రకాల అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ చైతన్యం పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల రోజుల పాటు జిల్లా పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు భాద్యతగా సహకారం అందించాలని కోరారు. మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వారిలో చైతన్యం నింపేందుకే ప్రత్యేకంగా ఈ కార్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలోని గంజాయి హాట్స్పాట్స్ లో నిత్యం తనిఖీలు చేపట్టడం, ఎవరైనా మత్తు పదార్దాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ నిర్వహించడం, వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా నిషేదిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ, విక్రయిస్తున్నట్లు గానీ, సేవిస్తున్నట్లు గానీ సమాచారం తెలిస్తే పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని కోరారు.

చైతన్యం పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు.