పశువులకు గాలికుంటు వ్యాధులకు ఉచితంగా టీకాలు : డాక్టర్ స్వప్న
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో పశువైద్యాధికారిణి డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో మొద్దులమాడ, దురదపాడు, గాడ్రాల గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. జాతీయ పథకం కింద పశువులకు ఈ టీకాలు ఉచితంగా అందిస్తున్నట్లు డాక్టర్: స్వప్న తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, పశువుల కాపరులు పాల్గొన్నారు.
