సాటి ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
-జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరదలు వచ్చి సర్వం కోల్పోయి నిరాశరులైన జలగం నగర్ వరద బాధితులకు జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో వరద ముంపు బాధిత కుటుంబాలకు ఇండ్ల దగ్గరికి వెళ్లి చాపలు ,బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాదిఖ్ అహ్మద్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు సాటి ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వమే సాయం చేయాలని చూస్తూ ఊరుకోకుండా ముందుకు వచ్చి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యాక్రమమలో ఇంద్ర నగర్ ఉపాధ్యక్షులు యసుఫ్ షరీఫ్ ఇస్లాం పెట్ కార్యకర్తలు జాఫర్, ఫైజాన్, మహిళా కార్యకర్తలు ఫర్జానా, షమీమ్, అర్శియ, అఫిఫా తదితరులు పాల్గొన్నారు