తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలింపు
ఏపీలో ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న వైనం తిరుమలలో వెలుగుచూసింది. తిరుమల నుంచి తిరుపతికి ఎర్రచందనాన్ని వాహనంలో రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తిరుమల శిలాతోరణం నుంచి కారులో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.