మాదారం మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
సాక్షిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ములకలపల్లి మండల కేంద్రంలో సొసైటీ పరిదిలోని మాదారం మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం రోజున ప్రారంభించిన అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని, వర్షాలు ఉంటే వడ్లు రక్షణ కోసం పట్టాలు ఇవ్వాలని, వీలైనంతవరకు త్వరగా వడ్లు కొనాలని, వడ్లు కొనుగోలు కేంద్రంలో రైతులకు టెంటు నీరు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షురాలు నడిపల్లి సునంద, తహశీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీవో రామారావు, మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణ్ బాబు, సొసైటీ సీఈఓ సారయ్య, సొసైటీ డైరెక్టర్లు,రైతులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
