employment జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి

employment జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి

SAKSHITHA NEWS

employment జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి.

జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి


employment *సాక్షిత వనపర్తి :వనపర్తి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఔత్సాహికలను ప్రోత్సహించి సత్వరమే అనుమతులు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.


కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో టి.జి. ఐపాస్ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచి ఉపాధి అవకాశాలు మెరుగు పరచేందుకు చర్యలు తీసుకోవాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.


పరిశ్రమల ఏర్పాటు కు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్, టౌన్ ప్లానింగ్, పరిశ్రమల శాఖల నుండి ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వడం లో జాప్యం చేయవద్దని సూచించారు.


నేటి సమావేశంలో ఇదివరకే బ్యాంకు రుణాలు పొంది వివిధ యూనిట్లు నెలకొల్పిన 13 మంది ఎస్సీ లకు రూ. 38,11,386, ఎస్టీలు 53 మందికి రూ. 193,97,704 , ఒక దివ్యాంగుడికి రూ.3,46,500 రూపాయల సబ్సిడీని కమిటీ ద్వారా ఆమోదం తెలిపింది.


అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్ జిల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారి యాదగిరి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యుత్ శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

employment

SAKSHITHA NEWS