కొత్తపల్లిలో విద్యుత్ సమస్యలకు త్వరలో పరిష్కారం….

Sakshitha news

కొత్తపల్లిలో విద్యుత్ సమస్యలకు త్వరలో పరిష్కారం….

అధికారికి గ్రామ సర్పంచ్ వినతి….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, కొత్తపల్లి/
పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామ సర్పంచ్ శ్రీమతి పెర్క రిబ్కా సంతోష్ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సహాయ విభాగ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామంలో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు, పొట్టి విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం, తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యను నివారించడం, విద్యుత్ సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలను తొలగించడం వంటి సమస్యలను అధికారికి వివరించి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు.

వినతిపై స్పందించిన విద్యుత్ శాఖ సహాయ విభాగ అధికారి సమస్యలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేసి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజల తరఫున స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

Scroll to Top