పరికె చెరువు కబ్జాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి విజ్ఞప్తి

Sakshitha news

పరికె చెరువు కబ్జాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి విజ్ఞప్తి ||

సాక్షిత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం):
126వ డివిజన్ జగద్గిరిగుట్ట పరిధిలోని భూదేవి హిల్స్‌లో ఉన్న పరికె చెరువు కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో ఈరోజు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * భూదేవి హిల్స్‌ను సందర్శించి, చెరువును కబ్జా చేసే వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మరియు హైడ్రా కమిషనర్ ని కోరారు. అలాగే, చెరువు చుట్టూ కంచ వేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గణేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, రషీద్, కృష్ణ గౌడ్, లక్ష్మ రెడ్డి, గోరె భాయ్, నరేందర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ చంద్రయ్య , బేకు శ్రీనివాస్, పండరి, సోమన్నా శ్రీధర్ రెడ్డి, ఎం.డి. జాకీర్, సంతోష్, ఎం.డి. లాయక్, పెరిక శివ, భరత్ గౌడ్, వేణు గౌడ్, పిల్లి ఆంజనేయులు, మహిళా నాయకులు కౌసల్య, అనిత రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.