SAKSHITHA NEWS

బీసీల సమగ్ర కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి……………..
బీసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నాగన మోని చెన్నరాములు డిమాండ్

*సాక్షిత వనపర్తి :
రాష్ట్రంలో బీసీల సమగ్ర కులగనన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ను నిర్వహించాలని బి సి ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నాగన మోని చెన్నరాములు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో బి సి ఎఫ్ జిల్లా కమిటీ గుంటి కురుమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల కుల గణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు జీవోను విడుదల చేయాలని అలాగే బీసీల దామాషా ప్రకారం అసెంబ్లీ పార్లమెంట్లలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు చట్టబద్ధమైన కమిషన్ వేసి మంత్రిత్వ శాఖల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు భూమిలేని బీసీలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రతి మండలంలో బీసీలకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలని కుల వృత్తులకు చేయూతనిచ్చి సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని బీసీలకు ప్రమోషన్ల లో రిజర్వేషన్ అమలు చేయాలి బీసీ అట్రాసిటీ చట్టం రూపొందించి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ఐడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు

బీసీలు రాజాధికారం కోసం రాజకీయంగా ఐక్యంగా పోరాడి సాధించాలని మహాత్మ పూలే ఆశయాల కోసం గులాంగిరి చేయకుండా స్వతంత్రంగా జీవించాలని సూచించారు మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎన్ నాగమ్మ మాట్లాడుతూ దేశంలో బీసీలు వెనుకబడటం వల్ల దారిద్రరేఖ కు దిగువన దీనంగా జీవిస్తున్నారు అని బీసీ మహిళలు అనేక రకాలైన బాధను అనుభవిస్తున్నారని మహిళా విముక్తి కోసం బిసిఎఫ్ లో మహిళలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాలు ప్రతినిధులు హాజరై నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా గుంటి కురుమూర్తి ముదిరాజ్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతయ్య యాదవ్ ఉపాధ్యక్షులుగా జానంపేట లీలావతి బాలస్వామి రజక మాజీ ఎంపిటిసి మిద్దె కృష్ణ జిల్లా కోశాధికారిగా ఎస్ చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శిగా వాకిటి రాజమౌళి పిల్లుట్లఅవినాష్ బుల్లెద్దుల కృష్ణ జిల్లా కమిటీ సభ్యులుగా ఉందే కోటి అంజి మహేష్ యాదవ్ బండలయ్య సుధాకర్ విజయ్ కుమార్ ఆత్మకూరు అంజి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కే వెంకటేశ్వర్లు జి.రవికుమార్ పి ప్రతాప్ గన్నోజ్ రవికుమార్ మనోజ్ శ్రీనివాసులు బోలె మోని దర్గేష్ తోట బాలరాజు రమేష్ సాగర్ పుల్లరి ఎన్ సుభాష్ చంద్ర తదితరులను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జిల్లా కమిటీ ఏకగ్రీవంగా నామినేట్ చేయడం జరిగింది.


SAKSHITHA NEWS