ఎన్నికల వీడియోగ్రఫీ పనులు స్థానికులకే ఇవ్వాలి..*ఆర్డీవో , మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం.
….
సాక్షిత ప్రతినిధి
కోదాడ:
స్థానిక వీడియోగ్రాఫర్లకు అవకాశం కల్పించండి అధికారులకు అసోసియేషన్ విన్నపం.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియోగ్రఫీ బాధ్యతలను కోదాడ పట్టణానికి చెందిన వీడియోగ్రాఫర్లకు ఇవ్వాలని ది కోదాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు వనపర్తి వర్మ ఆధ్వర్యంలో ఆర్డీఓ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవిలకు వినతి పత్రం అందజేశారు.
అసోసియేషన్ కు బాధ్యతలు అప్పగించడంతో నైపుణ్యం ఉన్న వారిచే ప్రతి వార్డులోనూ, పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో కవరేజ్ చేసేందుకు తమ సభ్యులు సిద్ధంగా ఉన్నారని వివరించారు. కొంతమంది పైరవీలు చేసుకునే వ్యక్తులకు అప్పగిస్తే నైపుణ్యం లేని వ్యక్తులచే సరిగా పనిచేయని కెమెరాలు తెచ్చి బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తారని వారి దృష్టికి తీసుకువెళ్లారు. అసోసియేషన్ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆర్డీవో కమిషనర్ నిబంధనల మేరకు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి స్వామి, ఉపాధ్యక్షులు వనం ప్రభాకర్, శ్యామల సైదులు, సంఘ సభ్యులు ఎస్ఎస్ శ్రీను, అశోక్, సైదులు, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
