గట్టుప్పల్‌లో ఘనంగా సీఎం కప్ మండల స్థాయి క్రీడాపోటీలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “చీఫ్ మినిస్టర్ కప్ 2025–26” కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో జరిగిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారుల కోసం మండల స్థాయి పోటీలను గట్టుప్పల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పోటీల్లో కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా వంటి విభాగాల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు మేడల్స్‌తో పాటు మేమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యస్పూర్తి, జట్టుస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే సీఎం కప్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, తహసీల్దార్, మండల విద్యాధికారి, సీనియర్ క్రీడా సభ్యులు, ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు ఈ వేదిక మరింత ఊతమిచ్చిందని వారు అభిప్రాయపడ్డారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY