సాయిబాబా నగర్ డివిజన్‌లో మంజీరా పైప్‌లైన్ జంక్షన్ పాయింట్ నిర్మాణ పనులను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 292వ డివిజన్ సాయిబాబా నగర్‌లో మంజీరా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పాయింట్ నిర్మాణ పనులను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా సాయిబాబా నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న మంజీరా తాగునీటి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ₹50 లక్షల HDF నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఆ నిధులతో జంక్షన్ పాయింట్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఈ పనులు పూర్తయిన అనంతరం సాయిబాబా నగర్ డివిజన్‌లో మంజీరా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, మూడు రోజులకు ఒకసారి ప్రతి ఇంటికీ మంజీరా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికిరణ్, డిసీసీ జనరల్ సెక్రటరీ సొమ్మన్న శ్రీధర్ రెడ్డి, సినియర్ కాంగ్రెస్ నాయకులూ భాస్కర్ రెడ్డి, డిసీసీ సెక్రటరీ కరణ్, చందు, నాగేష్ రెడ్డి, రామచందర్, నరసింహారెడ్డి, సత్తి రెడ్డి, నందగోపాల ప్రసాద్, గఫార్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
