లంచాలు, కమీషన్ల కోసమే ఎన్నికల బాండ్లు..
మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ, వాటిని నిలిపివేయాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతమయ్యాయని మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్లు స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని విమర్శించారు. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులతో నేడు దీనికి పరిష్కారం లభించిందని తెలిపారు.