సంఘీభావం తెలియజేసి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించిన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా జగ్గంపేటసెప్టెంబర్ 21: చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గండేపల్లి మండలం క్లస్టర్ ఇంచార్జ్ బొల్లం రెడ్డి రామకృష్ణ క్లస్టర్ లో గల గండేపల్లి, మురారి, రామయ్య పాలెం, సింగరం పాలెం, ఎన్ టి రాజా పురం, తాళ్లూరు గ్రామాల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షకు శిబిరంలో కూర్చుని నిరసన తెలియజేసి పోస్ట్ కార్డు ఉద్యమం కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కాం చేశారంటూ నిరాహార ఆరోపణ చేస్తున్నారని జేఎన్టీయూ, గైట్, ఆదిత్య, డెవలప్మెంట్ సెంటర్లు పరిశీలించానని 90%, 10% లో గత టిడిపి ప్రభుత్వం 10% 370 కోట్ల రూపాయలతో 48 సెంట్రల్ నిర్మించడం జరిగిందని ఒక్క జేఎన్టీయూ సెంటర్ కే పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని ఇందులో జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం కట్టడం జరిగిందని రెండు రెండు లక్షల 31 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కి అండగా ఉండి టిడిపికి మద్దతు ప్రకటించడం కలిసి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం శుభపరిణామని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ప్రతి పౌరుడు ఖండించాలని ఈ రాష్ట్రం మళ్ళీ తెలుగుదేశం అధికారంలో రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు సాయి తేజ, మారిశెట్టి భద్రం, పోతుల మోహన రావు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బుర్రి సత్తిబాబు, పైడిపాల సూరిబాబు, నీలం శ్రీను, అనుకుల శ్రీకాంత్, కంచుమర్తి రాఘవ, సర్వసిద్ధి లక్ష్మణరావు, రేఖ బుల్లి రాజు, దాపర్తి సీతారామయ్య, జంపన రవి వర్మ,, వేములకొండ జోగారావు, డేగల సత్తిబాబు, వేలమాటి కాశి, కంటిపూడి సత్యనారాయణ, చాగంటి వీర వెంకట సత్యనారాయణ, రెడ్డి సుబ్బారావు, ఫైన్ని వెంకటేశ్వరరావు, శీ లామంతుల వీరబాబు, వెంపాటి రాజు, ఇప్పర్ల సురేష్ సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు.