క్రేన్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

Sakshitha news

క్రేన్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి..

గోదావరి క్రేన్ ఓనర్స్ ఆపరేటర్స్ ఐక్యత కొనసాగాలి…

రక్తదానం ప్రాణదానంతో సమానం…

రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే బండారు…

క్రేన్ ఓనర్స్ అండ్ ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు.మంగళవారం గోదావరి క్రేన్ ఓనర్స్ & ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రేన్ ఓనర్స్, ఆపరేటర్స్ మెగా రక్తదానం శిబిరం ఏర్పాటుచేసి రక్త దానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాతలను అభినందిస్తూ రక్తదానం ప్రాణదానంతో సమానమని వ్యాఖ్యానించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా క్రేన్ ఓనర్స్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటుగా, వారికి రావులపాలెం పరిసర ప్రాంతాల్లో సామాజిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్రేన్ ఓనర్స్, ఆపరేటర్స్ ఐక్యతగా ముందుకు సాగాలని సూచించారు.

Scroll to Top