రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషిచేయాలి…
-సీతంపేట పార్కులో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు
రాజమహేంద్రవరం, సాక్షిత :
మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దేశ అభ్యున్నతికి అనుక్షణం కృషిచేసిన రాజీవ్ గాంధీ ఆయన సాధనకు కృషిచేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.
పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ టీ.కే. విశ్వేశ్వరరెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పి.సి.సి. సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, పి.సి.సి. సభ్యులు కిషోర్ జైన్, ఎండి షహన్‌షా, చింతాడ వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశానికి ఐటి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. తల్లి ఇందిరాగాంధీ మరణంతో భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారత దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషిచేసారని కొనియాడారు. ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపించడంతో యువతకు ఉద్యోగాల కల్పనకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. ఆనాడు ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు ప్రపంచడంలో భారత దేశం ఐటి రంగంలో పోటీ పడుతోందన్నారు. నేటి కాలంలో నాయకులు పరదాలు వేసుకుని వేల మందిని సెక్యూరిటీగా పెట్టుకుని పాలన సాగిస్తుంటే ఆయన సాధారణ వ్యక్తిగా అందరిని అప్యాయంగా పలుకరిస్తూ పాలన సాగించారన్నారు.
మళ్లీ కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అందరూ కృషిచేయాలని కోరారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 200 మంది కళాశాల, పాఠశాల పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేసారు.
కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు యిజ్జరౌతు సత్యనారాయణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు బత్తిన చంద్రరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నల్ల వీర్రాజు, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండ గోవింద రాజు, సురేషు, శ్రీను, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.