కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం, అరెస్టు చేసిన పోలీసులు
ముఖ్యమంత్రి పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన…………… బి ఆర్ఎస్
సాక్షిత వనపర్తి
ముఖ్యమంత్రి పదవిలో ఉండి కెసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో బి ఆర్ఎస్ యువత విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పట్టణ ఎస్సై హరి ప్రసాద్ ఆధ్వర్యంలోవిద్యార్థి, యువ నాయకులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు మాజీ ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై వనపర్తి జిల్లా బి ఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది
అనంతరం జిల్లా అధ్యక్షులుగట్టు యాదవ్ బొలెమోని లక్ష్మయ్య లు మాట్లాడుతూ
: మూసీ నది విషయం లో అడ్డొస్తే బిడ్డ కుక్క చావు చస్తావని ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా కెసిఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక థర్డ్ క్లాస్ వ్యక్తిలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని తమ నాయకుడు కెసిఆర్ పై మరోసారి ఇలాంటి వాక్యాలు చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు సీఎం పై చట్టపురమైన చర్యలు చేపట్టాలని లేకుంటే బి ఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రం అగ్ని గుండంగా మారుతోందని రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు ముఖ్యమంత్రి పోలీసులే కారణం అవుతారని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మార్క్ డైరెక్టర్ విజయకుమార్ కురుమూర్తి యాదవ్ వేణుగోపాల్ బండార్ కృష్ణ నాగన్న యాదవ్ ఉల్లం తిరుమల్ ఎర్ర శ్రీను డానియల్ ఎం సుబ్బు ఏకే భాష కర్ణాకర్ దేవర్గ నరసింహ బాబు నాయక్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిలో సూర్యవంశం గిరి హేమంత్ ముదిరాజ్ జోహార్ జోహార్ హుస్సేన్ చిట్యాల రాము స్టార్ రహీం రామస్వామి క్రాంతి