శంకర్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు
సాక్షిత శంకర్‌పల్లి: అసెంబ్లీలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శంకర్‌పల్లి మండల, మున్సిపల్
బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. శంకర్‌పల్లి ప్రధాన చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారు మాట్లాడుతూ బడ్జెట్ మీద లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన సీఎం వ్యక్తిగత దూషణ ఆరోపణలు సరికావన్నారు. కాంగ్రేస్ పార్టీకి సబితారెడ్డి అన్యాయం చేసిందని సిఎం రెవంత్ రెడ్డి అనడం ఎంత వరకు సమంజసమన్నారు. రెవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసింది సబితారెడ్డి కుటుంబమని మర్చిపోయావా అని నిలదీశారు. రెవంత్ రెడ్డి తన మూలాలను మరిచిపోయి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీలోకి రెవంత్ రెడ్డి తీసుకోవద్దని సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికి సబితారెడ్డి మాత్రమే నీకు అండగా ఉన్న సంగతి మర్చిపోయావన్నారు. జిల్లాలో 25 ఏళ్ళుగా ఐదు సార్లు ఏమ్మేల్యేగా మూడు సార్లు
మంత్రిగా ఓటమెరుగని నాయకురాలుగా ఏదిగిన సబితారెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. రెవంత్ రెడ్డికి సిఎం పదవి రాగానే కళ్లు నెత్తికి ఎక్కాయన్నారు. సమస్యలపై నిలదీసిన నాయకురాలుపై అరోపణలు చేయడం మంచిది కాదన్నారు. తక్షణమే ప్రజల సాక్షిగా సబితా రెడ్డికి క్షమాపణలు చెప్పాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పార్సి బాలకృష్ణ, పాపారావు, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏజాస్, శ్రీనివాస్ అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, విక్రాంత్ సింగ్ పాల్గొన్నారు.