SAKSHITHA NEWS

education విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందాలి.
త్వరగా ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి.
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు.
education జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

education సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఆదిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గుణాత్మకమైన విద్యానందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉపాద్యాయులను ఆదేశించారు.

education నూతనకల్, మద్దిరాల మండలాల్లో విస్తృతంగా పర్యటించి తనిఖీలు నిర్వహించారు. నూతనకల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు నివారణకు మందులు అందుబాటులో ఉంచాలని, వైద్యులు, సిబ్బంది తప్పక విధులకు హాజరుకావాలని అలాగే వచ్చే రోజులకు మెరుగైన వైద్య సేవలందాలని సూచించారు. హాల్ నందు జరుగుతున్న ఏఎన్ఎం ఆశ వర్కర్ల ట్రైనింగ్ క్లాసులలో కలెక్టర్ సందర్శించి సీజనల్ వ్యాధుల నుండి రక్షించుకొనుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను పరిశీలించి విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లపై నాణ్యమైన విద్యానందించాలని, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యార్థులకు అందుతున్న సౌలతులను అడిగి తెలుసుకున్నారు.

education స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. విద్యార్థులను మీ లక్ష్యాలకు అనుగుణంగా చదవాలని, చదువువల్లనె వ్యక్తి యొక్క గుర్తింపు వస్తుందని, ప్రతి ఒక్కరు తమ ఆశయ సాధన కోసం బాగా చదవాలని కలెక్టర్ వారికి తెలిపారు.

అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలు, గర్భిణీలకు మంచి పౌష్టికాహారం అందించాలని , పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తదుపరి హాజరు పుస్తకాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో కలెక్టర్ పాటలు పాడించారు, కేంద్రం నిర్వహణ చూసి కలెక్టర్ మెచ్చుకున్నారు.

గ్రామ పంచాయతీని పరిశీలించి గ్రామంలో రోజువారీ పారిశుధ్య పనులు చేపట్టాలని, ఇంటి పన్నులు వసూళ్లలో ముందుండాలని రివిజన్, డిమాండ్ రిజిస్టర్లను పరిశీలించారు.

ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. తదుపరి తహశీల్దార్ కార్యాలయంలో పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


అదేవిదంగా మద్దిరాల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని, గ్రామాల్లో పర్యటించాలని, హై రిస్క్ గ్రామాలను గుర్తించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

జెడ్పి పాఠశాలను సందర్శించి పిల్లలకు మంచి విద్యాబోధన అందించాలని సూచించారు. విద్యార్థులకు అందచేసిన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అలాగే ఏక రూపా దుస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి త్వరలో పరిష్కరించాలని సూచించారు. తదుపరి శ్రీలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ ను తనిఖీ చేసి స్టాక్ వివరాలు అలాగే రోజు వారీ రైతుల రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు.

రైతులకు ప్రభుత్వ ధరలకంటే ఎక్కువగా అమ్మితే చర్యలు తీసుకుంటామని అలాగే బోర్డ్ పై స్టాక్ వివరాలను తెలపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి.పి.ఓ సురేష్ కుమార్, తహశీల్దార్లు శ్రీనివాసరావు, ఆమీన్ సింగ్, జి.పి. కార్యదర్శులు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

education

SAKSHITHA NEWS