SAKSHITHA NEWS

ECHO ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి

తిరుపతి జిల్లా కలెక్టర్ తో ఎంపీ గురుమూర్తి భేటీ

తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఉన్న ప్రజల జీవన విధానం దుర్భరంగా మారిందని, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు సంబందించిన వాకాడు, చిట్టమూరు, తడ మండలాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయని గత మూడు సంవత్సరాలుగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో శాశ్వత రహదారులు నిర్మించలేనందున వర్షాకాలంలో రోడ్లు పూర్తిగా పాడైపోయి ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అత్యవసర సమయాలలో కనీసం అంబులెన్సు కూడా ప్రయాణం సాగించలేని పరిస్థితులు ఉన్నాయని కలెక్టర్ కి వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్, చైర్మన్ గా ఒక కమిటీ నియమింపబడిందని మునుపటి కలెక్టర్ లక్ష్మి షా ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతంలో పర్యటించి సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని కానీ తదుపరి ఏర్పడిన పరిస్థితులలో ఆయన మారిపోవడంతో సమస్యలు పరిష్కరింపబడలేదని కావున వీలైనంత త్వరగా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. సావధానంగా విన్న కలెక్టర్ త్వరలోనే కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరిస్తామని తెలియజేసారు.

ECHO

SAKSHITHA NEWS