తెలంగాణలో రూ. 1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో జోరుగా సాగిన మద్యం అమ్మకాలు.
ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.