డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా”డిఆర్ఎస్ ఎంయూఎన్ 2025″ వేడుకలు…..
సాక్షిత :*కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
గుండ్ల పోచంపల్లి మైసమ్మ గూడ లో గల డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో నిర్వహించిన “డిఆర్ఎస్ ఎంయూఎన్ 2025” కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ఇలాంటి ఈవెంట్ లను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో సామాజిక స్పృహ, క్లిష్టతరమైన సమస్యల పరిష్కారం, నాయకత్వ లక్షణాలు వంటి వాటిని పెంపొందించుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఏకె.అగర్వాల్, గర్వ్ అగర్వాల్, ప్రిన్సిపల్ వేణు గోపాల్, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
