SAKSHITHA NEWS

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని రోడ్లు డ్రైనేజీ పనులను చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

కె.పి.హెచ్.బి కాలనీలోని శ్రీలా అపార్ట్మెంట్ వెళ్లే మార్గంలోని డ్రైనేజీ నీళ్లు, వరద నీరు నిల్చుకోవడం అదేవిధంగా మలేషియన్ టౌన్షిప్ లోని అధిక వర్షాలు వచ్చినప్పుడు వర్షం నీరు డ్రైనేజీ నీరు నిలిచిపోవడం వల్ల వాసనలతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు.

కాలనీ అసోసియేషన్ల ఫిర్యాదుల మేరకు స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిసి శ్రీలా అపార్ట్మెంట్ మార్గాన్ని మరియు మలేషియన్ టౌన్షిప్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ శ్రీలా అపార్ట్మెంట్ వెళ్లే మార్గాన్ని వర్షపు నీరు డ్రైనేజీ నీరు వెళ్ళుటకు సంభందించిన సమస్యను స్థలా యజమానులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని అదేవిధంగా మలేషియన్ టౌన్షిప్ లోని పలు అపార్ట్మెంట్లో డ్రైనేజీ నీళ్లు నిలిచిపోవడం వల్ల వాసనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కాలనీవాసులతో సమన్వయం చేసుకొని డ్రైనేజీ నీరు మరియు వర్షపు నీరు వెళ్ళుటకు పరిష్కారం చేయాలని అధికారులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సాయిబాబా చౌదరి , మలేషియన్ టౌన్షిప్ అధ్యక్షులు సాయి చౌదరి, కాకర్ల సురేష్ ,ఆదినారాయణ, రాజేష్ , మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS