
ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మరియు వారి సహాయకులకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (TNGO) కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) నేడు అన్నదానం చేశారు.
అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి వారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ సేవలో భాగంగా, ఈ వారం కూడా డాక్టర్ ముజీబ్ స్వయంగా పాల్గొని రోగులకు భోజన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చికిత్స కోసం వచ్చే పేద రోగులకు మరియు వారి సహాయకులకు ఆకలి బాధలు కలగకూడదనే ఉద్దేశంతో ప్రతి వారం ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ నాల్గవ తరగతి ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, టి.ఎన్.జి.ఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కె.ఆర్.రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ అహ్మద్, బి. శంకర్, ముఖీమ్ ఖురేషి, శ్రీ ఏ.వి. శ్రీధర్, పాల్గొన్నారు. వీరితో పాటు ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆస్పత్రి యూనిట్ ప్రెసిడెంట్ బి. శివకుమార్, జిల్లా మరియు యూనిట్ సభ్యులు, హైదరాబాద్ జిల్లా ఏ.పీ.ఆ.ర్వో మహ్మద్ వహీద్ , మహ్మద్ ముస్తాఫా తదితరులు పాల్గొని రోగులకు సేవలు అందించారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY