తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు..
హైదరాబాద్ నగరంతో పాటు ఆర్టీసీ గ్రామ గ్రామాన కనెక్టివిటీ పెంపు
ఆర్టీసీ బస్ స్టేషన్ లు మౌలిక సదుపాయాలు, కొత్త రూట్ లు ,కొత్త బస్సుల పై ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు తో ముఖాముఖిలో మంత్రి పొన్నం ప్రభాకర్

మహా లక్ష్మీ పథకం తో పెరుగుతున్న రద్దీ తో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుంది. ఇందుకోసం మూడు రోజుల పాటు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ -1 లో ఉమ్మడి జిల్లాల వారిగా ఇంచార్జి మంత్రి, జిల్లా మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో, ఆర్టీసీ ఎండీ ఈడి లు, ఆర్ఎం లు ఉన్నతాధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశంలో తొలి రోజు ఉమ్మడి నల్గొండ ,మెదక్ ,రంగారెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై ఆర్టీసీ అధికారుల సమక్షంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు ఆర్టీసీ అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు.
నల్గొండ జిల్లా నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలు నాయక్ , జయవీర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహా లక్ష్మీ పథకం విజయవంతంగా కొనసాగుతుందని,ప్రపంచంలోనే ఆర్టీసీకి గొప్ప చరిత్ర ఉందని కొనియాడారు.రాష్ట్రంలో అవసరమైన నూతన బస్సుల కొనుగోలు ,కొత్త రూట్ లలో బస్సులు నడపడం,ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పై మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అండగా ఉంటామని తెలిపారు.
కోదాడ ,హుజూర్ నగర్ బస్ స్టేషన్ ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గుర్రం గూడ లో నైట్ హాల్ట్ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని , మిర్యాల గూడా హలియా,మైసంపల్లి మధ్య అదనపు బస్సులు నడపాలని కోరారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ తుంగతుర్తి కీ చుట్టు 50 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ బస్సు డిపో లేదని తమకు డిపో మంజూరు చేయాలని కోరగా ప్రస్తుతం కొత్త డిపో ల ప్రస్తావన లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేట , హనుమకొండ ,యాదగిరి గుట్ట బస్సులు మోత్కూరు ,తుంగతుర్తి లో ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్నారం మేజర్ గ్రామ పంచాయతీ నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. హైవే ల వద్ద మేజర్ గ్రామ పంచాయతీ లపై బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ ఫండ్స్ నుండి నిర్మిస్తే తాము మరిన్ని కొత్త బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో మదీరా, కొత్తగూడెం ,ఖమ్మం బస్సులు నకిరేకల్ పట్టణం గుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. వెంటనే రూట్ సర్వే నిర్వహించి బస్సులు పట్టణం గుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హయత్ నగర్ నుండి పల్లె వెలుగు చిట్యాల వరకు వేయాలని కోరారు.

నియోజకవర్గంలో కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని సూచించారు. దేవరకొండ లో ఉన్న పాత బస్ డిపో ను పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. విద్యార్థులకు స్కూల్ కాలేజీల సమయంలో బస్సులు పెంచాలని కోరారు. భువనగిరి నియోజకవర్గంలో కొండమాడు వద్ద బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.భవనగిరి బస్ స్టేషన్ లో గతంలో సాయంత్రం రద్దీగా ఉండేదని ఆరు సిటీ బస్సులు వేయడం వల్ల రద్దీ తగ్గిందని మరిన్ని బస్సులు కావాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఇప్పటికే కొత్త బస్సులు వచ్చాయని నారాయణఖేడ్ , పెద్ద శంకరంపేట లో బస్ స్టేషన్ ల అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి కోరారు. పెద్ద శంకరంపేట లో బస్ స్టేషన్ నుండి బస్సులు నడిపించాలని సూచించారు.
రంగారెడ్డి,గ్రేటర్ హైదరాబాద్ నుండి కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట లో రాష్ట్రం నలుమూలల నుండి ఆర్టిసి బస్సులు అక్కడికి వస్తాయని పార్కింగ్ కి ఇబ్బంది ఉందని తెలిపారు. హెచ్ఎండిఏ స్థలాన్ని ఉపయోగించుకొని పార్టీ స్థలం తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మించుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఎమ్మెల్యే వివేకానంద సూచించారు. కుత్బుల్లాపూర్ ,దుండిగల్, గండిమైసమ్మ ,బాచుపల్లి నిజాంపేట్ ప్రాంతాల్లోని 2 bhk కాలనీల వద్ద అత్యధిక రద్దీ ఉందని అక్కడ అదనపు బస్సులు నడపాలని కోరారు.
మల్కాజ్గిరి లో రోజువారి కూలీల అధికంగా ఉన్నారని వారికి సరిపడ పర్సనల్ పాలని మచ్చ బొల్లారం- చార్మినార్, మచ్చ బొల్లారం – ఈసీఎల్, మౌలాలి, ఆర్టీసీ కాలనీ ఈసీఎల్, సికింద్రాబాద్ కొత్త రూట్లో బస్సులు నడపాలని సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న అతి పెద్ద బస్టాండ్ జీబీఎస్ బస్ స్టేషన్ ఆధునిక మోడల్ బస్టాండ్ గా నిర్మించాలని ఉత్తర తెలంగాణకు వెళ్లే కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ బస్సు ఎక్కడ నుండి నడుస్తాయని మిమ్మల్ని శ్రీ గణేష్ సూచించారు.
బస్ స్టేషన్ ఆధునికరణకు అవసరమైన స్థలాన్ని కంటోన్మెంట్ బోర్డు నుండి తీసుకోవాలని సూచించారు. అన్నా నగర్, తాడ్ బండ్, బాలం రాయి ,బోయిన్పల్లి తూట్లలో అదనకు బస్సులు నడపాలని కోరారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎర్రగడ్డ , బోరబండ నుండి పటాన్చెరువు వివిధ ప్రాంతాలకు ప్రధానమంత్రి బస్సు నడపాలని కోరారు. హైదరాబాద్ కొత్త కాలనీకు కనెక్టివిటీ పెంచాలని విద్యాసంస్థలకు వెళ్ళే రూట్ లలో ఉదయం సాయంత్రం వేళ బస్సులు పెంచాలని కోరారు.
ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై ఆర్టీసీ అధికారులు నోట్ చేసుకొని నివేదిక రూపొందించనున్నారు. సమస్యల పరిష్కారం పై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
సమావేశంలో ఉమ్మడి నల్గొండ ,మెదక్ , రంగారెడ్డి,గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి,ఈడి లు , ఆర్ఎం లు , ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
