SAKSHITHA NEWS

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే జారె.

సాక్షిత :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం

దమ్మపేట మండలం, గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆయన రాసిన రాజ్యాంగం మన దేశానికి ఒక దిశానిర్దేశం అయిందన్నారు ఆయన కలలు కన్న సమాజాన్ని నిర్మించడమే మనందరి లక్ష్యం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ న్యాయం సమానత్వం హక్కుల పరిరక్షణ కోసం అంబేద్కర్ మార్గదర్శనాన్ని అనుసరిస్తూ పని చేస్తోందని దేశ ప్రజల హక్కులను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు.
అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు అందేలా కృషి చేస్తున్నామని ఇది కేవలం డాక్టర్ బాబా సాహెబ్ ఆశయాల వలనే సాధ్యమవుతుందన్నారు.