SAKSHITHA NEWS

డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపల్లి,గాజులరామారంలో భారత రాజ్యాంగ రూపకర్త డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడికి ఘన నివాళులర్పించారు..

అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత, రాజనీతిజ్ఞుడు,న్యాయకోవిదుడు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలు స్మరించుకున్నారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— దేశ నడవడిక, సమానత సుస్థిర అభివృద్ధి, నైతిక, ఆర్థిక అభివృద్ధి రాజ్యాంగం ప్రకారమే సాధ్యపడ్డాయన్నారు..

— ప్రపంచంలోనే ప్రజాస్వామ్య,దృఢమైన, అతి పెద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు..

— మన భారతదేశం పట్ల, దేశ ప్రజల పట్ల వారు ఆలోచించిన సుఆలోచన వల్లే ఈనాడు మనం అందరం సుఖ సంతోషాలతో బతుకగలుగుతున్నామన్నారు..

ఈ కార్యక్రమంలో జిమ్మి నాగమణి దేవేందర్, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు కందడి సుదర్శన్ రెడ్డి, బైరి సరిత శివకుమార్ గౌడ్, ఎర్రోళ్ల కృష్ణ, పూర్ణచంద్ర రావు, షేక్ ఇబ్రహీం, రాజశేఖర్ రెడ్డి, అంజి ముదిరాజ్, కావలి నవీన్, కావలి గోపాల్,షేక్ ఖదీర్, శ్రీనివాస్ గౌడ్ గోపాల్ రెడ్డి, గాజులరామారం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి జగన్, వెంకట్ స్వామి, యాదగిరి, జగ్గులు తో పాటు అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, ప్రజలతోపాటు తదితరులు పాల్గొన్నారు..