ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ….
సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:
కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం…
పేద కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి గా ఎదిగిన గొప్ప శాస్త్రవేత్త.
భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కలాం జయంతి సందర్భంగా కోదాడ పట్టణం గాంధీ పార్క్ లో ఉన్న కలాం విగ్రహానికి స్వర్ణ భారతి, విజయీభవ ట్రస్టు, ఇరుకుళ్ల ఫౌండేషన్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రి ప్రగడ భారతారావు, పోతుగంటి నాగేశ్వరరావు లతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి తొలి మిస్సైల్ ను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నారని అన్నారు. రాష్ట్రపతి గా ఎదిగిన గొప్ప శాస్త్రవేత్త భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ అని ఆయన సేవలను స్మరించారు. అనంతరం కలాం ఆశయాలు సాధిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, మంత్రి ప్రగడ భారతారావు, పోతుగంటి నాగేశ్వరరావు లను అబ్దుల్ కలాం అవార్డులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ భారతి ట్రస్టు ప్రధాన కార్యదర్శి ఓరుగంటి కిట్టు, చారు గండ్ల ప్రవీణ రాజశేఖర్, కోశాధికారి ఇరుకుళ్ల చెన్నకేశవరావు, పందిరి సత్యనారాయణ,మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు, ఓరుగంటి ప్రభాకర్,సాయి, వెంకటరమణ, నరేందర్, గీతా, వంగవీటి లోకేష్,బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
