విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు ముద్దు బిజెపి నేతలు
….
సాక్షిత :+నెల్లూరు జిల్లా కోవూరు ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ అను నినాదాన్ని వివరిస్తూ విదేశీ వస్తువుల మీద ఆధారపడకుండా మన సొంతంగా తయారు చేసుకొని మనం వినియోగించుకునే విధంగా ఆత్మ నిర్భరభారత్ ను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు బిజెపి కోవూరు మండల అధ్యక్షుడు పోలిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో కోవూరు శ్రీ సీత కోదండ రాముడు వారి దేవస్థానంలో వారి దేవాలయంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాలు తయారీ దగ్గర నుండి బ్రహ్మోస్ క్షిపణి వరకు కూడా మన భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తున్నప్పుడు ఏ వస్తువును కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మనకే మనమే తయారు చేసుకునే విధంగా ఆత్మ నిర్భరభారత్ ఉండాలని సూచించారు.విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులే ముద్దు అని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు మండలంలో మండల అధ్యక్షులు పోలిశెట్టి వెంకటసుబ్బారావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు ఆత్మ నిర్భరభారత్ కో-ఆర్డినేటర్ కరణం సుభాషిని,జిల్లా ఉపాధ్యక్షులు కాసాని శ్రీనివాసులు, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గాదిరాజు చక్రవర్తి, కోవూరు ఆత్మ నిర్భరభారత్ ఇంచార్జ్ వల్లెపు ఝాన్సీ, శశికిరణ్, సోషల్ మీడియా చిలుకోటి నాగరాజు, శ్రీనివాసులు, ధోని పత్తి శ్రీనివాసులు, కొండవీటి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
