విద్యాధికారులు బాధ్యత నిబద్ధతతో విధులు నిర్వహించాలి లేకుంటే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి హెచ్చరిక
సాక్షిత వనపర్తి
విద్యాశాఖ అధికారులు నిబద్దతతో
బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు.
కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ లు, క్లస్టర్ హెడ్మాస్టర్ల పాఠశాలల సందర్శన నివేదికను తనిఖీ చేసిన కలెక్టర్, ఈ నెలలో ఇప్పటివరకు ఒక్క పాఠశాల కూడా సందర్శించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు విధి నిర్వహణలో నిబద్దతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమాజంలో విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చి మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు కీలక పాత్ర అని బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో పాల్గొనాలని ఆదేశించారు.
ఎంఈఓ లు, క్లస్టర్ హెడ్మాస్టర్లు తప్పనిసరిగా రోజుకు రెండు లేదా మూడు పాఠశాలలను విధిగా సందర్శించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సందర్శించిన పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ అటెండెన్స్, అపార్ ఐడి జనరేషన్ పై దృష్టి సాధించి మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం పదో తరగతి బోర్డు ఫలితాల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉండొద్దని ఆదేశించారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, ఎంఈఓ లు, క్లస్టర్ హెడ్మాస్టర్లు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
