భావి భారత క్రీడాకారులుగా ఎదగాలి

Sakshitha news

భావి భారత క్రీడాకారులుగా ఎదగాలి…

సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా:
క్రీడల్లో రాణించి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి.
ఇండోర్ స్టేడియంలో అత్యాధునిక లైటింగ్ సిస్టం ప్రారంభం.క్రీడల్లో రాణించి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఏటుకూరి రామారావు, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో గల ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కొరకు ఆధునిక టెక్నాలజీతో సొసైటీ నిధులు మూడున్నర లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా కోదాడలో తాము దాతల సహకారంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసేందుకు ఎంతగానో కృషి చేశామని క్రీడాకారులు ఇట్టి స్టేడియంలో శిక్షణ పొంది క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి కోదాడ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆవుల రామారావు, రామినేని శ్రీనివాసరావు, కోశాధికారి తోట రంగారావు, బీసీ మెంబర్స్ సురేష్ రెడ్డి, శ్రీధర్ క్రీడాకారులు పాల్గొన్నారు.