దాతలు ముందుకు రావాలి… ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలి

Sakshitha news

దాతలు ముందుకు రావాలి… ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలి

  • చంద్రబాబు తీసుకొచ్చిన పి4 ఉద్దేశ్యం కూడా ఇదే
  • లబ్దిపొందినవాళ్లు భవిష్యత్తులో పదిమందిని ఆదుకోవాలి
  • సామాజిక బాధ్యత గల పార్టీ టిడిపి
  • టిడిపి కుటుంబ సభ్యుల ఔదార్యం అభినందనీయం
  • ఇంజనీరింగ్ విద్యార్ధికి లాప్ టాప్ బహుకరణ
  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమహేంద్రవరం,

దాతలు ముందుకొచ్చి ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) సూచించారు. శశి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న వి శివప్రియకు ఆదిరెడ్డి కుటుంబం, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో లాప్ టాప్ ను ఎమ్మెల్యే వాసు తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో కలిసి అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ శివప్రియకు లాప్ టాప్ అవసరమని చెప్పడంతో టిడిపి కుటుంబ సభ్యులు స్పందించి అందజేశారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు తాము చేస్తున్నప్పటికీ, వనరుల సర్దుబాటు కారణంగా అందరికీ సేవలు అందించలేకపోతున్నామని అన్నారు. అయితే టిడిపి కుటుంబ సభ్యులు కూడా ముందుకొచ్చి ఇలాంటి వారికి సాయం అందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చిన పి4 ఉద్దేశ్యం కూడా ఇదేనని ఎమ్మెల్యే వాసు అన్నారు. ముఖ్యమంత్రి పిలుపుని అందుకుని ప్రతిభగల విద్యార్థులను ఆదుకోడానికి దాతలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈవిధంగా సాయం పొందినవాళ్లు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన తర్వాత పదిమందిని ఆదుకునే విధంగా తయ్యారవ్వాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. ఆవిధంగా ఉన్నత స్థానానికి వెళ్తే అందరికీ ఆనందమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ సామాజిక బాధ్యత గల పార్టీ అని ఎమ్మెల్యే వాసు స్పష్టంచేసారు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అర్ధం ఉంటుందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పూర్తితో పి4 పిలుపును అందుకుని రాజమండ్రిలో ఒక విద్యార్థినికి లాప్ టాప్ టీడీపీ కుటుంబ సభ్యులు అందించారని ఆయన పేర్కొంటూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ తరపున కూటమి తరపున చేయనున్నట్లు ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతిఏటా పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన క్రీడా పరికరాలు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పేద ప్రజలకు వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సహాయం చేయడం జరుగుతొందన్నారు. భవిష్యత్తులో కూడా తమ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, ద్వారా పార్వతి సుందరి, శివా రెడ్డి, కనకాల రాజా, దుత్తరపు గంగాధర్, అగురు ధన్ రాజ్, కప్పల వెలుగు కుమారి, చాపల చిన్నరాజు, బంగారు నాగేశ్వరరావు, కందికొండ అనంత్, మండల రవి, మండల నాయుడు, మదినా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.