
ప్లాస్టిక్ వాడొద్దు… పర్యావరణాన్ని నష్టపరచొద్దు
సీఎం చేత ”ప్లాస్టిక్ వినియోగం – ప్రమాద ఘంటికలు” పుస్తక ఆవిష్కరణ
పర్యావరణ పరిరక్షణకు సే నో టూ ప్లాస్టిక్: మంత్రి సురేఖ
మండలి చైర్మన్, స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు స్టీల్ టిఫిన్ బాక్సు అందజేత
హైదరాబాద్
తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని… పర్యావరణాన్ని నష్టపరచొద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా
ప్లాస్టిక్ వినియోగం ప్రమాద ఘంటికలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. మంత్రి కొండా సురేఖ పర్యావరణ పరిరక్షణకు సే నో టూ ప్లాస్టిక్ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు జూట్ బ్యాగు, పుస్తకం, కాపర్ బాటిల్, స్టీల్ టిఫిన్ బాక్సు, బట్ట సంచులను మంత్రి కొండా సురేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి ఉన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం 5,00,000,00,00,000 (5 లక్షల కోట్లు) కంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు వాడి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం 10,00,000 (10 లక్షలు) వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 630 కోట్ల టన్నులు అని వివరించారు.
వీటిలో 79% ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాలు, నీటి వనరులలో పారేస్తున్నారన్నారు. మిగిలిన 12% ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై వదిలేస్తున్నారని చెప్పారు. 9% మాత్రమే రీసైకిల్ చేయబడుతున్నాయన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు… మన కాల్వలు, సరస్సులు, నదీ ప్రవాహాలను అడ్డుకుంటున్నాయన్నారు. మొక్కలు, వృక్షాలు, జంతు జలాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల కాన్సర్ కారక విషపూరిత వాయులు వెలువడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రో ప్లాస్టిక్ లు జంతువులు, మానవ శరీరాల్లోకి చొరబడతాయని, అందుచేత, ఎస్యూపీ వద్దు… సే నో టూ ఎస్యూపీ నినాదంతో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎస్యూపీ వినియోగం పూర్తిగా నివారించి బయో డిగ్రెడబుల్ వస్తువులను వాడాలని కోరారు.
ప్లాస్టిక్ కవర్లు… నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు లాంటివి నివారించి జూట్, బట్ట సంచులను వాడాలని సూచించారు. జూట్ బ్యాగ్, బట్ట సంచులు…, అలాగే ప్లాస్టిక్ బ్లాటిల్స్ వినియోగాన్ని నివారించి దానికి బదులుగా గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ ఉపయోగించాలని…. వీరందరి సురేఖ కాపర్ బాటిల్ నేతలందరికీ అందజేశారు.
ప్లాస్టిక్ బాక్సులలో ఆహారాన్ని వినియోగించొద్దని తెలియజేస్తూ స్టీల్ టిఫిన్ బాక్సును అందజేశారు.
