SAKSHITHA NEWS

గోదావరి నది పరివాహక గ్రామాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ *

సాక్షితజగిత్యాల జిల్లా :; వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి పరీవాహక గ్రామాలైన చేగ్యం, పశిగామా, ముక్కారావుపేట్ , కోటిలింగాల వద్ద గల పుష్కర ఘాట్ గోదావరి యొక్క వరద ప్రభావాన్ని ఎస్పీ గారు పరిశీలించారు.

గోదావరి నది పరివాహక ప్రాంత మండలాలైన ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్ ,బీర్పూర్ ధర్మపురి, వెల్గటూర్ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు ,గొర్రెలు మెపడానికి, చేపలు పట్టడానికి వెళ్లకూడదని అన్నారు.రాన్నున మూడు రోజులో కూడా వర్షాలు ఉన్న దృష్ట్యా అవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు.వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 నెంబర్ కి కాల్ చేసి పోలీసుల సహాయం పొందవలసిందిగ సూచించారు

ఎస్పి వెంట డిఎస్పి రఘు చంధర్, ధర్మపురి సి.ఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్.ఐ ఉమా సాగర్ ఉన్నారు.


SAKSHITHA NEWS