SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

త్వరలో జరుగబోవు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓటర్ల జాబితా యందు ఓటరుగా నమోదు చేసుకొనుటకు నేటి (గురువారం) వరకు మాత్రమే గడువు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకొననివారు, వారికి దగ్గరలోని తహశీల్దార్ కార్యాలయములో ఫారం -18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. మరియు
ceotelanagana.nic.in అనే వెబ్సైట్ ద్వారా కూడా అన్లైన్ లో దరఖాస్తు చేసుకొనవచ్చని తెలిపారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ప్రతిఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదుచేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP