SAKSHITHA NEWS

అభిప్రాయ సేకరణ రేపటికి వాయిదా:జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

గద్వాల్ : -నూతనంగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ యాక్ట్ (ROR) చట్టం – 2024 పై అభిప్రాయ సేకరణ కొరకు జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజెన్లతో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమావేశం అనివార్య అకరణాలవల్ల శనివారం మధ్యాహ్నం 4:00 గంటలకు మార్చబడినదని జిల్లా కలెక్టర్
బి.ఎం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇట్టి విషయాన్ని జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజన్ లు తదితరులు అందరూ గమనించగలరని తెలుపుతూ, ఇదే సమావేశాన్ని శనివారం సాయంత్రం 4:00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశంలో సీనియర్ సిటిజన్లు, మేధావులు, రైతు సంఘాల సభ్యులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు హాజరై తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

WhatsApp Image 2024 08 23 at 13.24.24

SAKSHITHA NEWS