SAKSHITHA NEWS

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నర్సింగరావు, జిల్లా బి.సి సంక్షేమ అధికారి రమేష్ బాబు, వాల్మీకి సంఘం నాయకులు గట్టు తిమ్మప్ప, ఆంజనేయులు, కౌన్సిలర్ మురళి, రాజు, మధుసూదన్ బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు…


SAKSHITHA NEWS